పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Published on Sun, 01/25/2026 - 14:34

2026 సంవత్సరానికి గానూ కేంద్రం ప్రభుత్వం పద్మ  పురస్కారాలను ‍ప్రకటించింది. ఐదుగురికి పద్మ విభూషణ్,13 మందికి పద్మభూషణ్, 113 మందికి కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు, కుటుంబశాస్త్రి, రాజేంద్ర ప్రసాద్( కళావిభాగం) మరళీమెహన్( కళావిభాగం), రాజేంద్రప్రసాద్ (కళావిభాగం).... తెలంగాణ విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డమానుగు చంద్రమౌళి, దీపికారెడ్డి (కళావిభాగం), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ లకు  పురస్కారం దక్కింది. తెలంగాణలో మెుత్తంగా ఏడుగురికి, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురికి ఈ ఏడాది అవార్డులు దక్కాయి.

దివంగత మాజీ సీఎం అచ్యుతానందకు పద్మ విభూషన్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. కళా విభాగంలో ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముటికి పద్మభూషణ్ అవార్డులు లభించాయి.  ఈ సందర్భంగాప్రధాని నరేంద్ర మోదీ పద్మ పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న రంగాలలో వారి అంకిత భావం, సేవ, భారత సమాజ నిర్మాణాన్ని సుసంపన్నం చేశాయన్నారు. వారి నిబద్ధత, శ్రేష్ఠత భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

భారతరత్న తర్వాత పద్మ అవార్డులను  కేంద్ర ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారాలుగా భావిస్తారు. కళలు, విద్య, సాహిత్యం, క్రీడలు, వైద్యం, సామాజికసేవ, పరిశ్రమలు, వైద్యం, ప్రజాసేవలు ఇలా విభిన్న రంగాలలో ఉత్తమ సేవలు కనబరిచిన వ్యక్తులకు ఈ అవార్డు అందిస్తారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును కేంద్రం ప్రకటిస్తుంది. పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.
 

పద్మశ్రీ పురస్కార గ్రహీతలు 

1. కుమారసామి తంగరాజ్
2 మామిడి రామారెడ్డి ( తెలంగాణ)
3. భగవందాస్ రైక్వార్
4. భిక్ల్య లడక్య ధిండా
5. బ్రిజ్ లాల్ భట్
6. బుధ్రి తాటి
7. చరణ్ హెంబ్రామ్
8. చిరంజీ లాల్ యాదవ్
9. ధర్మైక్ లాల్ చునీలాల్ పాండ్యా
10. గఫ్రుద్దీన్ మేవాటి జోగి
11. హాలీ వార్
12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ
13. కె. పజనివేల్
14. కైలాష్ చంద్ర పంత్
15. కేమ్ రాజ్ సుంద్రియాల్ 
16. కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి
17.అంకె గౌడ
18. మహేంద్ర కుమార్ మిశ్రా
19. మీర్ హాజీభాయ్ కసంభాయ్
20. మోహన్ నగర్
21. నరేష్ చంద్ర దేవ్ వర్మ
22. నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా
23. నూరుద్దీన్ అహ్మద్
24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్
25. పద్మ గుర్మెట్
26. పోఖిల లెక్తేపి
27. పున్నిమూర్తి నటేశన్
28. ఆర్ కృష్ణన్
29. రఘుపత్ సింగ్
30. రఘువీర్ తుకారాం ఖేద్కర్
31. రాజస్తపతి కాలియప్ప గౌండర్
32. ఆర్మిడా ఫెర్నాండెజ్2
33. రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే
34. SG. సుశీలమ్మ
35. సంగ్యుసాంగ్ ఎస్ పొంగెనర్
36. షఫీ షౌక్
37. శ్రీరంగ్ దేవబ లాడ్
38. శ్యామ్ సుందర్
39. సిమాంచల్ పాత్రో
40. సురేష్ హనగవాడి
41. తగా రామ్ భీల్
42. టెకీ గుబిన్
43. తిరువారూర్ భక్తవత్సలం
44. విశ్వ బంధు
45. యుమ్నం జత్రా సింగ్

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)