Breaking News

మానవ తప్పిదమే.. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణానికి కారణం

Published on Fri, 12/20/2024 - 09:34

ఢిల్లీ : మానవ తప్పిదం వల్లే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్ డిసెంబర్ 8, 2021న ఎంఐ-17 హెలికాప్టర్‌  ప్రమాదంలో మరణించారని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ధ్రువీకరించింది. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ మంగళవారం లోక్‌సభ ముందుంచింది.  

2017 - 2022 వరకు 'పదమూడవ డిఫెన్స్ పీరియడ్ ప్లాన్' పేరిట రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2017-2022 వరకు మొత్తం భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది.

 

వాటిల్లో అప్పటి సీడీఎస్‌ బిపిన్‌ రావత్ తమిళనాడులోని కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదం కూడా ఉందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో  ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ సందర్భంగా బిపిన్‌ రావత్‌ ప్రమాదానికి కారణం మానవ తప్పిదేమేనని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులోని సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి బయల్దేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు ఆ రోజు ఉదయం రావత్‌ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు.

అయితే మార్గం మధ్యలో హెలికాప్టర్‌ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్‌ హెలికాప్టర్‌ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్‌ డేటా రికార్డర్‌, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డులను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చాము’ అని స్టాండింగ్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు