Breaking News

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

Published on Wed, 01/28/2026 - 15:17

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ విమాన ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బారామతి రన్‌వేకు 100 అడుగుల దూరంలో కుప్పకూలి.. మంటల్లో చిక్కుకున్న దృశ్యాల వీడియో వెలుగులోకి వచ్చింది. ఇవాళ ఉదయం (బుధవారం, జనవరి 28) 8:46: గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు,ఆపై దట్టమైన పొగ వెలువడటం వీడియోలో కనిపించింది.

విఎస్ఆర్ (VSR) సంస్థకు చెందిన లియర్ జెట్ 45 (Learjet 45).. ఉదయం 8:10 గంటలకు ముంబై నుండి బయలుదేరింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ (66)తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రాడార్‌ సమాచారం ప్రకారం.. విమానం ఉదయం 8:45 గంటలకు రాడార్ పరిధి నుంచి తప్పిపోయింది. విమానం కూలిపోయే ముందు రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించింది. సంకేతాలు నిలిచిపోయే సమయానికి విమానం 1016 మీటర్ల (సుమారు ఒక కిలోమీటర్) ఎత్తులో, గంటకు 237 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

 

విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన
విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. పైలట్‌ నుంచి మేడే కాల్‌ రాలేదన్న ఆ శాఖ.. బారామతి  ఏటీసీ క్లియరెన్స్‌ ఇచ్చాకే ల్యాండింగ్‌కు యత్నించారని పేర్కొంది. రన్‌ వే నెంబర్‌ 11పై ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇచ్చిందని తెలిపింది. 8.44 గంటలకు పొగల, మంటల కనిపించాయని ఏటీసీ చెబుతోంది. రన్‌ వే గుర్తింపులో పైలట్లు ఇబ్బంది పడ్డారని.. తొలి ప్రయత్నంలో రన్‌ వే కనిపించకపోవడంతో కాసేపు గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. రెండో ప్రయత్నంలో ల్యాండ్‌ అయ్యేందుకు యత్నించి విఫలయినట్లు ఏటీసీ తెలిపింది.

ఇవాళ  అజిత్‌ పవార్‌.. తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్‌ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవాళ్లంతా సజీవ దహనం అయ్యారు. అజిత్ పవార్‌తో పాటు ముంబై పీఎస్వో విదీప్ జాదవ్, ఫ్లైట్‌ అటెండెంట్‌ పింకీ మాలి, పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్‌ మరణించారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)