Breaking News

రేఖ.. మామూలు చీటర్‌ కాదు

Published on Wed, 01/29/2025 - 09:48

యశవంతపుర(కర్ణాటక) : ఐశ్వర్య గౌడ తరువాత.. బెంగళూరులో మరో యువతి ఘరానా మోసానికి పాల్పడింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి రూ.25 కోట్ల ఆర్థికసాయం ఆశ చూపించి రూ. 6 కోట్లు శఠగోపం పెట్టింది. రేఖ అనే యువతిని, ఆమె భర్త మంజునాథ ఆచారి, అతని స్నేహితుడు చేతన్‌లను సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్‌ దయానంద తెలిపారు. ఈ నెల 13న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.  

ఎలా చేసిందంటే 
వివరాలు.. తమకు బ్యాంకుల అధికారులు, ఐటీ, ఈడీ అధికారులు తెలుసని రేఖా ప్రచారం చేసుకునేది. అలా ఒక రియల్టర్‌ను నమ్మించింది. రూ.25 కోట్ల రుణం ఇప్పిస్తానని ఆశ చూపింది.  తమ ఖాతాలో భారీగా డబ్బులు ఉన్నాయని, వాటిని ఈడీ సీజ్‌ చేసిందని, ఆ డబ్బును తీయాలంటే పన్నులు, లంచాలు కట్టాలని వ్యాపారికి తెలిపింది. ఇలా అతని నుంచి విడతలవారీగా రూ.6 కోట్లను రేఖా, మంజునాథ ఆచారి, చేతన్‌లు తీసుకున్నారు. తరువాత వారిది పచ్చి మోసమని తెలుసుకున్న రియల్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  హోసకోట సమీపంలోని ఒక ప్రైవేటు హాస్టల్‌లో తలదాచుకున్న రేఖాను అరెస్ట్‌ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు భర్త మంజునాథ్‌ ఆచారి, చేతన్‌లను కేఆర్‌పుర అయ్యప్పనగరలోని నివాసంలో పట్టుకున్నారు.

మోసాల చిట్టా పెద్దదే 
విచారణ జరపగా రేఖా బాగోతాలు బయటకు వచ్చాయి. అనేక మందికి లోన్‌ ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో బయట పడింది. ఒక వ్యక్తికి వీడియోకాల్‌లో బెదిరించి రూ.31 లక్షలు వసూలు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని కొందరి నుంచి లక్షలు గుంజుకుంది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతోంది. రేఖాకు చెందిన హెచ్‌డిఎఫ్‌సి, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అకౌంట్లలో 2022 నుంచి 2024 వరకు రూ.24 కోట్ల వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. మరింత విచారణ కోసం చేతన్‌ను సకలేశపురకు తరలించారు.    

చదవండి: పెళ్లి ‍బ్యానర్‌తో పట్టుబడ్డ నిత్యపెళ్లి కూతురు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)