Breaking News

సీబీఎస్‌ఈ: మూడో భాష ఫెయిలైతే టెన్త్ సర్టిఫికెట్ రాదు!

Published on Tue, 07/14/2026 - 12:34

న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)2020లో భాగంగా 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాషను పాఠశాల స్థాయి అంతర్గత మూల్యాంకన (ఇంటర్నల్ అసెస్‌మెంట్) తప్పనిసరి సబ్జెక్టుగా మారుస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష బోర్డు ద్వారా కాకుండా పాఠశాల స్థాయిలోనే జరుగుతుందని, అయితే ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని బోర్డు స్పష్టం చేసింది. ఇందులో పాస్ కాని విద్యార్థులకు టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికెట్ లభించదు.

ఈ నూతన త్రిభాషా సూత్రం ప్రకారం, విద్యార్థులు కచ్చితంగా రెండు భారతీయ భాషలను, ఒక పరభాషను (నాన్-నేటివ్ ల్యాంగ్వేజ్) చదవాల్సి ఉంటుంది. 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలోకి, 2027-28లో 10వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ 10వ తరగతిలో విద్యార్థి అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోతే, బోర్డు ఫలితాల విడుదలకు ముందే పాఠశాలలు తిరిగి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. 9వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్ చేసినప్పటికీ, తదుపరి ఏడాదిలోగా ఆ పెండింగ్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)