Breaking News

విద్యార్థులకు శుభవార్త: లైవ్‌లోకి సీబీఎస్‌ఈ రీ ఎవాల్యుయేషన్ పోర్టల్

Published on Tue, 06/02/2026 - 08:07

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ క్లాస్ 12 ఫలితాల తర్వాత జరగాల్సిన రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ప్రారంభం కావాల్సిన ఈ పోర్టల్, సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున 4:42 గంటలకు సీబీఎస్‌ఈ ఈ పోర్టల్‌ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది.

ఆలస్యమైన పోర్టల్ ప్రారంభం
సీబీఎస్‌ఈ తన పోర్టల్‌ను జూన్ 1న ప్రారంభిస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, సాంకేతిక లోపాల వల్ల అది సాధ్యపడలేదు. సోమవారం రోజంతా వెబ్‌సైట్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం బోర్డు అధికారులు వెబ్‌సైట్ త్వరలోనే లైవ్‌లోకి వస్తుందని ప్రకటించినప్పటికీ, అర్ధరాత్రి దాటిన తర్వాతే పోర్టల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

సైబర్ భద్రతపై సీబీఎస్‌ఈ దృష్టి
ఈ పోర్టల్ ప్రారంభానికి ముందు ‘ఆన్ మార్క్’ (OnMark) పోర్టల్‌లో కొన్ని భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల సమాచారం, పేపర్ల మూల్యాంకనంలో పారదర్శకతను పెంచేందుకు, సీబీఎస్‌ఈ రంగంలోకి దిగింది. ప్రభుత్వ సైబర్ నిపుణులు, ఐఐటీ (IIT) నిపుణుల బృందాన్ని రంగంలోకి దించి, సిస్టమ్‌ను మరింత పటిష్టం చేసింది. అన్ని లోపాలను సరిదిద్ది, సర్వర్‌ను సురక్షితమైన వాతావరణంలోకి మార్చినట్లు బోర్డు స్పష్టం చేసింది.

విద్యార్థులకు కీలక సూచనలు
రీ-ఎవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇప్పుడు అధికారిక పోర్టల్ ద్వారా తమ ప్రక్రియను కొనసాగించవచ్చు. ఒకవేళ ఇంకా ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, విద్యార్థులు సీబీఎస్‌ఈ టెలి-కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ నంబర్ 1800 11 8004 ద్వారా లేదా resultcbse2026@cbseshiksha.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని పారదర్శకంగా వినియోగించుకోవాలని బోర్డు సూచించింది.

ఇది కూడా చదవండి: 30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)