Breaking News

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన: ‘ఓనర్‌కు తెలిసే ఉల్లంఘన’

Published on Sun, 09/01/2024 - 08:46

ఢిల్లీ: భారీ వరద కారణంగా ఢిల్లీలోని రావుస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి నీరు పోటెత్తి.. ముగ్గురు సివిల్స్‌ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. ఈ కేసులో నిందితులు అయిన రావుస్‌ కోచింగ్ సెంటర్‌ ఓనర్‌.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ (MCD) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తెలిసి కూడా ఉద్దేశపూర్వంగా బేస్‌మెంట్‌ను లైబ్రరీగా వినియోగించారని దర్యాప్తు సంస్థ సెంట్రల్‌ బ్యూరో  ఆఫ్‌ ఇన్‌వెస్టిగేషన్‌( సీబీఐ) ఆరోపణలు చేసింది.

ఈ నేపథ్యంలో నిందుతులైన కోచింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని అభిషేక్ గుప్తా, ఇతర నిందితులు దేశపాల్ సింగ్, హర్విందర్ సింగ్, పర్వీందర్ సింగ్, సరబ్జీత్ సింగ్ , తజిందర్ సింగ్‌లను ‘కస్టడీ విచారణ’ కోసం అనుమతి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ సీబీఐ  ప్రత్యేక కోర్టు కోరింది.శనివారం అడిషినల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ నిశాంత్ గార్గ్ ఆరుగురి నిందితులను సెప్టెంబర్ 4 వరకు సీబీఐ కస్టడీకి పంపించారు. రావుస్‌ కోచింగ్‌ సెంటర్‌కు సుమారు ఏడాది నుంచి ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికేట్‌ లేదని తమ దర్యాప్తులో తెలిసిందని పేర్కొంది.

ఇదే విషయాన్ని గతేడాది ఈ ప్రాంతంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు లేవని హైకోర్టు గుర్తించినట్లు తెలిపింది.దీంతో   రావుష్‌ స్టడీ సర్కిల్ యజమానికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కోర్టుకు ప్రత్యేక కోర్టుకు వెల్లడించింది. కాగా.. ఆగస్ట్ 8, 2023న కోచింగ్‌ సెంటర్‌ యజమాని ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కోసం ఎంసీడీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జూలై 9, 2024న ఇన్‌స్టిట్యూట్‌కి సర్టిఫికేట్‌ను అధికారులు జారీ చేశారని తెలిపారు. ఈ ఘటనపై జూలై​ 27న చోటుచేసుకోగా.. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కేసు నమోదు అయిది. ఇక.. విచారణను ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసుల నుంచి  ఆగస్టు 2న సీబీఐకి బదిలీ చేసింది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)