Breaking News

కోల్‌కతా డాక్టర్‌ కేసు.. ఆ వేలి ముద్రలు ఎవరివి?

Published on Fri, 08/23/2024 - 18:32

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్య, అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో బాధితురాలి స్నేహితులకు లై డిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

వైద్యురాలి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆమె నలుగురి స్నేహితుల్ని విచారించారు. విచారణలో వారు చెప్పిన సమాధానాలు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే ఆమె స్నేహితులకు లై డిటెక్టర్‌ టెస్ట్‌లు నిర్వహించే యోచనలో సీబీఐ అధికారులు ఉన్నారంటూ జాతీయ మీడియా కథనాలు హైలెట్‌ చేస్తున్నాయి. లై డిటెక్టర్‌ టెస్ట్‌లో ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్న్‌లు ఉన్నారు. తాజాగా, ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై దారుణం జరగకముందు, జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. 

ఆ రాత్రి ఏం జరిగింది?
ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందన్న దానిపై సీబీఐ కీలక సమాచారం సేకరించింది. ఆగస్ట్‌ 8న అర్ధరాత్రి వేళ బాధిత జూనియర్‌ వైద్యురాలు, ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు. అనంతరం సెమినార్ గదికి వారు వెళ్లారు. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌ను వీక్షించారు. కాగా, తెల్లవారుజామున 2 గంటలకు, ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు విశ్రాంతి తీసుకునే గదిలోకి వెళ్లారు. బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది. సెమినార్ హాల్, డాక్టర్లు విశ్రాంతి తీసుకునే గది, ఇంటర్న్‌ల గది కూడా మూడవ అంతస్తులో దగ్గరగా ఉన్నాయి.

మరోవైపు మరునాడు ఉదయం 9.30 గంటలకు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌లలో ఒకరు బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్లాడు. దూరం నుంచి కదలలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని చూశాడు. వెంటనే తన సహోద్యోగులకు, సీనియర్ వైద్యులకు అతడు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆసుపత్రి అధికారులకు ఈ సమాచారం అందించారని సీబీఐ అధికారులు తెలుసుకున్నారు.

అయితే వైద్యురాలిపై దారుణం జరిగిన ప్రదేశంలో ఆమె నలుగురి స్నేహితుల్లో ఇద్దరి వేలుముద్రలు లభ్యమవ్వడం.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారికి లై డిటెక్టర్‌ చేయాలంటూ సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)