Breaking News

Kolkata: మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు

Published on Sat, 03/23/2024 - 11:05

కోల్‌కతా: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలడిగిన కేసులో మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ శనివారం ఉదయం సోదాలు ప్రారంభించింది. కోల్‌కతాలోని మహువా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఇటీవలే ఈ కేసులో మహువాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే.

క్యాష్‌ ఫర్‌ క్వెయిరీ కేసు దర్యాప్తులో భాగంగానే సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున ఎంపీగా ఎన్నికైన మహువా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకుగాను వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ  ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా స్పీకర్‌ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. 

డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సుదీర్ఘ ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఇటీవలే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే ఫిర్యాదు మేరకు లోక్‌పాల్‌ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై మహువా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఇదీ చదవండి.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)