Breaking News

సీబీఐ కస్టడీకి షాజహాన్‌ షేక్‌

Published on Thu, 03/07/2024 - 06:15

కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత షాజహాన్‌ షేక్‌ను సీబీఐ అధికారులు ఎట్టకేలకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. అతడిని తక్షణమే సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు రెండుసార్లు ఉత్తర్వులు జారీ చేయడంతో పశి్చమ బెంగాల్‌ సీఐడీ అధికారులు స్పందించక తప్పలేదు.

బుధవారం సీబీఐ అధికారులకు అప్పగించారు. వాస్తవానికి ఈడీ అధికారులపై దాడి కేసులో దర్యాప్తును, నిందితుడు షాజహాన్‌ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ మంగళవారమే కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయినా పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వం లెక్కచేయలేదు. ఈ ఉత్తర్వును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెంగాల్‌ ప్రభుత్వ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

మరోవైపు కలకత్తా హైకోర్టులో ఈడీ బుధవారం మరో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం నాటి ఉత్తర్వును అమలు చేయాలని, షాజహాన్‌ షేక్‌ను సాయంత్రం 4.15 గంటలకల్లా సీబీఐకి అప్పగించాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ బృందం బుధవారం సాయంత్రం 4 గంటలకు సీఐడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.

సీఐడీ అధికారులు సాయంత్రం 6.48 గంటలకు షాజహాన్‌ షేక్‌ను సీబీఐ బృందానికి అప్పగించారు. అంతకంటే ముందు అతడిని ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. కరడుగట్టిన నేరగాడిగా ముద్రపడిన షాజహాన్‌ షేక్‌పై సందేశ్‌ఖాలీలో దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తీవ్రంగా స్పందించారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)