Breaking News

అబద్ధాల పుట్ట సందీప్‌ ఘోష్‌.. అభయ కేసు దర్యాప్తుపై సీబీఐ అధికారులు

Published on Mon, 09/16/2024 - 15:22

కోల్‌కతా : ఆర్జీ కార్‌ ఆస్పత్రి అభయ కేసు విచారణలో సీబీఐ కీలక విషయాల్ని వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌కు సీబీఐ అధికారులు  పాలిగ్రాఫ్ టెస్ట్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌ పరీక్షల్లో సైతం అన్నీ అబద్ధాలు చెప్పినట్లు తేలిందని సీబీఐ అధికారులు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నుండి వచ్చిన రిపోర్ట్‌ సైతం సందీప్‌ ఘోష్‌ చెప్పిన సమాధానాలు మోసపూరితంగా ఉన్నట్లు పీటీఐ సైతం నివేదించింది.

అభయ కేసు విచారణలో సీబీఐ అధికారులు పలు కీలక విషయాల్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ఆగస్టు 9న ఆర్జీ కార్‌ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై దారుణం జరిగినట్లు సందీప్‌ ఘోష్‌కు ఉదయం 9.58 గంటలకు సమాచారం అందింది. కానీ సందీప్‌ ఘోష్‌ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలి స్నేహితులు, తోటి జూనియర్‌ డాక్టర్లు విమర్శలు చేయడంతో ఆ తర్వాత జరిగిన ఘటనకు.. ఏ మాత్రం సంబంధం లేకుండా ఫిర్యాదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

హత్య జరిగితే.. ఆత్మహత్య అని ఎలా అంటారు?
అదే సమయంలో ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పిన విషయాన్ని సీబీఐ అధికారులు ప్రస్తావించారు. బాధితురాలి దుస్తులు, ఆమె శరీరంపై గాయాలు ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారు అని దర్యాప్తు  అధికారులు ప్రశ్నిస్తున్నారు.  

కేసు నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైంది?
అభయ ఘటనపై సందీప్‌ ఘోష్ ఆగస్టు 9 ఉదయం 10.03 గంటలకు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి (ఓసీ) అభిజిత్ మోండల్‌తో సంప్రదించగా.. ఉదయం 11.30 గంటలకు అసహజ మరణం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇదే అంశంపై సీబీఐ అధికారులు మోండల్‌ను అరెస్ట్‌ చేశారు. 

జనరల్‌ డైరీ ఎంట్రీలో ఇలా
జనరల్ డైరీ ఎంట్రీ 542 ప్రకారం.. ఆర్‌జీ కార్‌  మెడికల్‌ కాలేజీ సెమినార్‌ హాల్‌లో వైద్యురాలు అచేతనంగా పడి ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ అప్పటికే బాధితురాలిని పరిశీలించిన ఆమె సహచర జూనియర్‌ డాక్టర్‌ మరణించినట్లు నిర్ధారించారు.  

సాక్ష్యాలన్నీ నాశనం
ఆసుపత్రి అధికారులు, నిందితులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ జనరల్‌ డైరీలో వివరాలు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో మోండల్ జాప్యం చేయడం, నేరం జరిగిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై కీలకమైన సాక్ష్యాలు దెబ్బతిన్నాయని సీబీఐ అధికారులు తెలిపారు.

బాధితురాలి ఘటనపై ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా తెల్లవారు జామున 4.03 గంటలకు నిందితుడు సంజయ్‌ రాయ్‌ సెమినార్‌ హాల్‌లో ఉన్న అభయ గదిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అంనతరం, అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)