Breaking News

త్రిపుర చిట్ ఫండ్ కేసు: 12 ఏళ్ల తర్వాత సీబీఐకి చిక్కిన నిందితుడు

Published on Tue, 02/04/2025 - 07:50

న్యూఢిల్లీ: త్రిపుర చిట్ ఫండ్ కుంభకోణం కేసులో దాదాపు 12  ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని మహారాష్ట్రలోని భివాండిలో  సీబీఐ అరెస్టు చేసింది. అధికారులు  తెలిపిన వివరాల ప్రకారం త్రిపుర చిట్ ఫండ్ కేసులో వికాస్ దాస్ 2013 నుండి పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.20,000 రివార్డును ప్రకటించారు.

‘సూచ్నా రియల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’, దాని డైరెక్టర్లు అధిక లాభాల హామీనిచ్చి వందలాది మంది పెట్టుబడిదారుల నుండి డబ్బు వసూలు చేశారని, అయితే కంపెనీ పెట్టుబడిదారులకు ఎటువంటి మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation) (సీబీఐ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 2012లో మెచ్యూరిటీ మొత్తాన్ని సంబంధీకులకు చెల్లించకుండానే చిట్‌ఫండ్‌ కార్యాలయాన్ని మూసివేశారన్నారు.

అగర్తలలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి 2024, ఆగస్టు 16న నిందితుడు వికాస్ దాస్‌(Vikas Das)ను ప్రకటిత నేరస్తునిగా వెల్లడించి, అతనిపై వారెంట్ జారీ చేశారు. అనంతరం నిందితుని ఆచూకీ తెలిపిన వారికి సీబీఐ రూ. 20,000 రివార్డును కూడా ప్రకటించింది. అయితే నిందితుడు 12 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు సీబీఐ 2025 ఫిబ్రవరి 3న భివాండిలో అరెస్టు చేసింది. కాగా సీబీఐ 2023లో రెండు కేసులు నమోదు చేసింది. వీటిలో  వికాస్‌ దాస్ ప్రధాన నిందితుడు. ఈయన ‘సూచ్నా రియల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే చిట్ ఫండ్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ కంపెనీ దాదాపు రూ. 6,60,000 మేరకు మోసానికి పాల్పడింది. కేసు దర్యాప్తు  అనంతరం సీబీఐ 2025, జనవరి 21న వికాస్‌ దాస్, సుజిత్ దాస్, కంపెనీపై చార్జిషీట్ దాఖలు చేసింది.

ఇది కూడా చదవండి: మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)