Breaking News

పోలీసులంటే దేవుళ్లు కాదు

Published on Wed, 07/02/2025 - 08:21

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గత నెల 4న జరిగిన తొక్కిసలాటకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) క్రికెట్‌ జట్టు బాధ్యత వహించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌(క్యాట్‌) పేర్కొంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఐపీఎస్‌ అధికారి వికాశ్‌ కుమార్‌తోపాటు పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనను సస్పెండ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ వికాశ్‌ కుమార్‌ ‘క్యాట్‌’ను ఆశ్రయించారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. 

ఆయన విజ్ఞప్తిపై క్యాట్‌ విచారణ జరిపింది. విజయోత్సవాలకు దాదాపు 5 లక్షల మంది తరలివచ్చారని, ఇందుకు ఆర్సీబీదే బాధ్యత అని స్పష్టంచేసింది. పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోలేదని తప్పుపట్టింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జట్టు యాజమాన్యం హఠాత్తుగా సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో లక్షల మంది తరలివచ్చారని, వారిని అదుపులో చేయడం పోలీసులకు సాధ్యం కాలేదని వెల్లడించింది. 

తగినంత సమయం లేకపోవడంతో వారు ఏర్పాట్లు చేయలేకపోయారని తెలిపింది. ‘పోలీసులు కూడా మామూలు మనుషులే. వారు దేవుళ్లు కాదు. ఇంద్రజాలికులు కూడా కాదు. వారు మాయలు మహిమలు ప్రదర్శించలేరు. పోలీసుల వద్ద అల్లావుద్దీన్‌ అద్భుత దీపం లేదు’’అని క్యాట్‌ తేలి్చచెప్పింది. వికాశ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది. 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)