Breaking News

పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్‌ సింగర్‌పై పదుల సంఖ్యలో కేసులు

Published on Mon, 04/28/2025 - 12:39

లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోక్‌ సింగర్‌పై కేసు నమోదైంది. ఆమెపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లక్నో పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన ఫోక్‌ సింగర్‌ నేహా సింగ్ రాథోడ్ ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. అందులో జాతీయ సమగ్రతపై ప్రతీకూలం ప్రభావం చూపేలా అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు.  మతం ఆధారంగా సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా  ట్వీట్‌ చేసిందంటూ అభయ్ ప్రతాప్ సింగ్ లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నేహాసింగ్‌ రాథోడ్‌ చేసిన ట్వీట్లను పరిశీలించారు.  ఆ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం,  ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించారనే సెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 కాగా, పహల్గామ్‌ విషాదంపై కేంద్రం సోషల్‌ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా, ఫోక్‌ సింగర్‌ నేహా సింగ్ రాథోడ్‌పై చర్యలకు సిద్దమైంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)