Breaking News

ఎంపీ మహువా మొయిత్రాపై మళ్లీ కేసు

Published on Sun, 07/07/2024 - 18:14

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై తాజాగా మరో క్రిమినల్‌ కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) చీఫ్‌ రేఖాశర్మపై దూషణపూర్వక వ్యాఖ్యలు చేసినందుకుగాను మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్‌(ట్విటర్‌)లో తమపై చేసిన వ్యాఖ్యలకుగాను మహువా మీద మహిళా కమిషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఇటీవల హత్రాస్‌ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖాశర్మ  సందర్శించిన వీడియోపై మహువా మొయిత్రా ఎక్స్‌(ట్విటర్‌)లో వివాదాస్పద కామెంట్స్‌ చేశారు. ఆ వీడియోలో రేఖాశర్మకు ఆమె సహాయకుడు గొడుగు పట్టడంపై ఓ నెటిజన్‌ స్పందించారు. రేఖాశర్మ ఆమె గొడుగు ఆమె సొంతగా ఎందుకు పట్టుకోలేపోతున్నారని ఆ నెటిజన్‌ ప్రశ్నించారు. 

దీనికి రేఖాశర్మ ఆమె బాస్‌ పైజామా ఊడిపోకుండా పట్టుకునే పనిలో బిజీగా ఉండటం వల్లే గొడుగు పట్టుకోలేకపోతుందని మహువా వివాదాస్పద కామెంట్స్‌ పోస్ట్‌ చేశారు. మహువా మొయిత్రా గత లోక్‌సభలో తన ఎంపీ పదవి నుంచి సస్పెన్షన్‌కు గురై ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. 

#

Tags : 1

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)