Breaking News

‘37 లక్షల కుక్క కాట్లతో రేబిస్‌ నిర్మూలన సాధ్యమా?’: కార్తీ చిదంబరం

Published on Wed, 07/23/2025 - 10:19

న్యూఢిల్లీ: దేశంలో కుక్కకాటు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై తమిళనాడు శివగంగ నియోజకవర్గం లోక్‌సభ ఎంపీ కార్తీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 37 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయని, ఇటువంటి పరిస్థితుల్లో 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరేనా? అంటూ కార్తీ చిదంబరం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ప్రశ్నించారు.

కార్తీ చిదంబరం తన పోస్టులో.. దేశంలో చోటుచేసుకుంటున్న లక్షల కుక్కకాట్లను విస్మరించలేని సమస్యగా పేర్కొన్నారు. పార్లమెంట్‌ దిగువ సభలో మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సహాయ మంత్రి ఎస్ పీ సింగ్ బాఘెల్ 2024లో మొత్తం కుక్క కాటు కేసులు 37,17,336 నమోదయ్యాయని తెలిపారు. దీనిపై కార్తీ చిదంబరం సోషల్‌ మీడియాలో స్పందించారు. గత ఏడాది 54 అనుమానిత మానవ రేబిస్ మరణాలు సంభవించాయని మంత్రి చెప్పిన విషయాన్ని కార్తీ చిదంబరం గుర్తుచేశారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) ద్వారా నేషనల్ రేబిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి డేటాను సేకరించినట్లు పార్లమెంటులో మంత్రి భాగేల్‌ తెలిపారు.
 

భారతదేశంలో రేబిస్ తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా పరిణమించింది. ప్రపంచవ్యాప్త రేబిస్ మరణాలలో భారతదేశంలో 36 శాతం నమోదవుతున్నాయి.  ఏటా 20 వేల మరణాలకు రేబిస్‌ కారణంగా నిలుస్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలే అధికంగా రేబిస్‌ బారిన పడుతున్నారు. 
గత ఆరు నెలల్లో కర్ణాటకలో 2.3 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు, 19 రేబిస్ మరణాలు నమోదయ్యాయి. మరోవైపు కేరళ ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోందని మంత్రి ఎం.బి. రాజేష్  ఇటీవల పేర్కొన్నారు. కేరళ ఆరోగ్య, విద్యా శాఖలు సంయుక్తంగా రాష్ట్రంలోని  పాఠశాలల్లో రేబిస్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)