Breaking News

దళిత విద్యార్ధికి అండగా సుప్రీంకోర్టు.. సీటు ఇవ్వాలని ఆదేశం

Published on Mon, 09/30/2024 - 17:44

న్యూఢిల్లీ: గ‌డువు తేదీలోగా ఫీజు  కట్టలేకపోయిన ఓ పేద విద్యార్థికి అడ్మిష‌న్ ఇవ్వాల‌ని ఐఐటీ ధ‌న్‌బాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిభ గల విద్యార్థిని ఫీజు విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అసలేం జరిగిందంటే..ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అతుల్‌కుమార్‌  ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్టానిక్‌ ఇంజనీరింగ్‌లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్‌ 24 లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉండగా,అతడి తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోయారు. 

తండ్రి రోజుకు 450 సంపాదించే కూలీ అవ్వడంతో..వారి నిస్సహాయతను చూసిన టిటోడా గ్రామస్థులు విరాళాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు. అయితే అప్పటికే గడువు తేదీ దగ్గర పడటంతో.. చివరిరోజుసాంకేతిక కారణాలతో ధన్‌బాద్‌ ఐఐటీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ పనిచేయక అతుల్‌ ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది.

దీంతో విద్యార్ధి తనకు న్యాయం చేయాలని కోరుతూ తొలుత జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి.ఆ తర్వాత చెన్నై లీగల్ సర్వీసెస్‌కు వెళ్లాడు. అయిన ప్రయోజనం లేకపోవడంతో మద్రాస్‌ హైకోర్టును అశ్రయించాడు. మద్రాస్‌ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరింది. 

తాజాగా నేడు సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. ‘ విద్యార్థి చాలా తెలివైన వాడు. కేవలం రూ. 17,000 కట్టలేని కారణంగా అతని చదువును కోల్పోయాడు. ప్రతిభావంతుడైన వ్యక్తి ఫీజు కట్టని విషయంలో వదిలివేలయం. అతుల్ కుమార్‌ను అదే బ్యాచ్‌లో చేర్చుకోవాలి. మరే ఇతర విద్యార్థి అభ్యర్థిత్వానికి భంగం కలగకుండా సూపర్‌న్యూమరీ సీటు సృష్టించాలి. అతనికి సీటు కల్పించాలి’ అని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)