Breaking News

బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై కెనడా ఉగ్ర ముద్ర

Published on Tue, 09/30/2025 - 05:09

మాంట్రియల్‌: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చినట్లు కెనడా అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. కెనడాలో హింస, ఉగ్రవాదానికి ఎంతమాత్రం స్థానం లేదని తేల్చిచెప్పారు. ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రయత్నిస్తే సహించబోమని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ గతవారం కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు.

భారత్‌–కెనడా మధ్య సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభించాలని, ఉగ్రవాదం, సీమాంతర నేరాలపై ఉమ్మడి పోరాటం సాగించాలని వారిద్దరూ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాపై కెనడా ప్రభుత్వం ఉగ్రవాద ముద్ర వేయడం గమనార్హం. దీనివల్ల ఆ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి, ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని కెనడా మంత్రి గారీ ఆనంద సంగారీ చెప్పారు. కెనడాలో అధికారిక గణాంకాల ప్రకారం 88 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి.

ఇందులో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను కూడా చేర్చారు. ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చితే వాటి ఆస్తులను, డబ్బును, వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. ఇండియన్‌ గ్యాంగ్‌స్టర్‌ బాలకరణ్‌ బ్రార్‌ అలియాస్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ తన పేరిటే గ్యాంగ్‌ ఏర్పాటు చేశారు. ఇండియాతోపాటు కెనడాలో పలు నేరాల్లో అతడి హస్తం ఉందని గుర్తించారు. హత్య, కాల్పులు, బలవంతపు వసూళ్లు వంటి ఆరోపణలు వచ్చాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)