Breaking News

కంబోడియాలో భారతీయులతో సైబర్‌ క్రైమ్స్‌.. అబ్దుల్‌ ముఠా అరెస్ట్‌

Published on Sat, 07/13/2024 - 19:26

ఢిల్లీ: చైనీయులతో చేతులు కలిపి దేశంలో నిరుద్యోగులను మోసం చేస్తూ వారిని కంబోడియాకు పంపిస్తున్న సైబర్‌ నేరస్థుడు ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. సిరిసిల్లకు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో అబ్ధుల్‌ను క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అ‍బ్ధుల్‌ ఆలం.. చైనీయులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. నిరుద్యోగులను మోసం చేస్తూ వారిని కంబోడియాకు పంపించాడు. కాగా, సిరిసిల్లకు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్‌ను ఢిల్లీలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక, అబ్దుల్‌ ప్రస్తుతం దుబాయ్‌లో నివాసం ఉంటున్నట్టు సమాచారం.

మరోవైపు.. అబ్ధుల్‌ ఇప్పటి వరకు దేశం నుంచి దాదాపు వేయి మందికిపైగా నిరుద్యోగులను కంబోడియాకు పంపినట్టు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన యువకులను కంబోడియాకు పంపి అక్కడ వారితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయినట్టు పోలీసులు గుర్తించారు. అబ్ధుల్‌ ముఠా చైనీయులతో కలిసి ఇలా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ మోసాల్లో సింగపూర్‌, థాయ్‌ల్యాండ్‌, బ్యాంకాక్‌కు చెందిన ముఠా హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజుల క్రితం సైబర్‌ నేరాల్లో భాగమైన భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ కంబోడియాలో భాగంగా వారిని భారత్‌కు తరలించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)