Breaking News

Patna High Court: భార్యను భూతం.. పిశాచి అనడం క్రూరత్వం కాదు

Published on Sun, 03/31/2024 - 04:56

పట్నా: వైవాహిక జీవితం విఫలమైన సందర్భంలో ఒక భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కాదని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. తననుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె మాజీ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్‌కుమార్‌గుప్తాకు 1993లో బిహార్‌లోని నవదా పట్టణానికి చెందిన మహిళతో వివాహం జరిగింది.

అదనపు కట్నం కింద కారు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తన భర్త, అతడి తండ్రి సహదేవ్‌ గుప్తా కలిసి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె 1994లో నవదాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రీకుమారులపై కేసు నమోదైంది. వారిద్దరి విజ్ఞప్తి మేరకు ఈ కేసు నలందా జిల్లాకు బదిలీ అయ్యింది. నరేశ్‌కుమార్‌ గుప్తా, సహదేవ్‌ గుప్తాకు 2008లో నలందా కోర్టు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ వారిద్దరూ అదనపు సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు.

వారి అప్పీల్‌ను పదేళ్ల తర్వాత కోర్టు తిరస్కరించడంతో పట్నా హైకోర్టుకు వెళ్లారు. ఇంతలో జార్ఖండ్‌ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. 21వ శతాబ్దంలో ఒక మహిళను ఆమె అత్తింటివారు భూతం, పిశాచి అంటూ ఘోరంగా దూషించడం దారుణమని విడాకులు తీసుకున్న మహిళ తరపున ఆమె లాయర్‌ వాదించారు. ఇది ముమ్మాటికీ క్రూరత్వమేనని, తండ్రీ కుమారులను కఠినంగా శిక్షించాలని కోరారు.

అందుకు జస్టిస్‌ బిబేక్‌ చౌదరి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. విఫలమైన వివాహ బంధాల్లో దంపతులు పరస్పరం దూషించుకొనే సందర్భాలు చాలా వస్తుంటాయని అభిప్రాయపడింది. భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కిందికి రాదని తేల్చిచెప్పింది. పైగా సదరు మహిళ నిర్దిష్టంగా ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయలేదని పేర్కొంది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)