రైతన్నలకు ‘మద్దతు’ 

Published on Thu, 05/29/2025 - 01:59

సాక్షి, న్యూఢిల్లీ:  రైతన్నలకు శుభవార్త. 2025–26 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన సిఫార్సులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. 

గత సంవత్సరం కంటే వరిధాన్యంపై ఎంఎస్పీని క్వింటాల్‌కు 3 శాతం, తృణధాన్యాలపై 5.9 శాతం, నూనె గింజలపై 9 శాతం పెంచారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం, ఇప్పటికే వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఖరీఫ్‌లో పంటల ఉత్పత్తిని భారీగా పెంచే దిశగా అన్నదాతలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కనీస మద్దతు ధరను కేంద్రం పెంచినట్లు తెలుస్తోంది. 

దేశీయంగా ఉత్పత్తిని పెంచాలని, విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేబినెట్‌ కమిటీ సమావేశం వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచడంతోపాటు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

 వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ సిఫార్సుల మేరకు గత 11 ఏళ్లలో పంటలకు ఎంఎస్పీని భారీగా పెంచినట్లు గుర్తుచేశారు. ఈ ఖరీఫ్‌లో వరిధాన్యం(గ్రేడ్‌–ఏ) మద్దతు ధరను రూ.69 పెంచినట్లు చెప్పారు. ఈ పెంపుతో క్వింటాల్‌ వరిధాన్యం ధర రూ.2,389కు చేరినట్లు వెల్లడించారు. ఎంఎస్పీ కోసం కేంద్ర ప్రభుత్వం ఈసారి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించినట్లు స్పష్టంచేశారు. పంటల సగటు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర నిర్ణయించినట్లు అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)