Breaking News

నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం

Published on Wed, 11/24/2021 - 16:22

సాదత్ అలీ అనే క్యాబ్‌ డ్రైవర్‌.. గుర్తున్నాడా? ఈ ఏడాది జూలై 30న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రియదర్శిని యాదవ్‌ అనే ఓ యువతి చేతిలో నడిరోడ్డుపై 22 చెంప దెబ్బలు తిన్నాడు. అప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే తాజాగా సాదత్ అలీ ఉత్తరప్రదేశ్‌ రాజీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అయితే అలీ రాజకీయ పార్టీలో చేరికపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా అన్యాయంగా యువతుల చేతిలో తీవ్రమైన వేధింపులకు గురైన పురుషులకు కోసం తన గళాన్ని వినిపించడానికి రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.

చదవండి: నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్‌ మాజీ’

దాంతో పాటు క్యాబ్‌ డ్రైవర్లకు అండగా నిలుస్తానని చెప్పారు. చాలా చోట్ల పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. అందుకు తనపై యువతి చేసిన దాడి ఘటన ఓ నిదర్శమని అన్నారు. ఆ ఘటనలో తనకు ఇంకా న్యాయం జరగలేదని, న్యాయం జరిగితే.. తనలా వేధింపులకు గురవుతున్న పురుషులకు అండగా నిలిచి, సాయం చేస్తామని తెలిపారు.

ఇప్పటికీ సాదత్‌ అలీకి న్యాయం జరగలేదని.. అందుకోసమే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో అడుగుపెట్టారని అలీ తరఫు లాయర్‌ మీడియాకు వెల్లడించారు. సాదల్‌ అలీ చేరిన ఈ పార్టీని మాజీ ముఖ్యమంత్రి ములయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివ్‌పాల్‌ సింగ్‌ స్థాపించిన విషయం తెలిసిందే. నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు తిన్న క్యాబ్‌ డ్రైవర్‌.. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చాడని సోషల్‌ మీడియాలో చర్చసాగుతోంది.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)