Breaking News

CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!

Published on Tue, 02/27/2024 - 19:54

ఢిల్లీ: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ‍ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్‌లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్‌ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్‌లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాలు ద్వారా తెలుస్తోంది.

గత నెల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌ అతిత్వరలో వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అ‍ప్పడు మరోసారి  వివాదాస్పద పౌరసత్వ చట్టంపై తీవ్ర దుమారం రేగింది.  పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలోనే  కేం‍ద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.

దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక.. చట్టం అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య  ఘర్షణలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయటంలో తాత్కాలికంగా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ ప్రవేశపెట్టక ముందే.. సీఏఏను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏమిటీ చట్టం...
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది.

వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్‌ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది.

► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు.
► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు.
► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి.
► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)