సోనమ్‌ మేఘాలయా హనీమూన్‌ ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌..

Published on Fri, 06/20/2025 - 21:51

షిల్లాంగ్‌: సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్యకేసు మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ప్రతి సంఘటన ఒక్కో క్లైమాక్స్‌ను తలపిస్తోంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పెళ్లైన పదకొండు రోజులకే సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీకి ఇష్టం లేకపోయినా హనీమూన్‌ పేరిట మేఘాలయాకు తీసుకెళ్లి, ముందస్తు ప్లాన్‌ ప్రకారం.. సుపారీ కిల్లర్ల సాయంతో హత్య చేయించిన విషయం తెలిసిందే. హత్య అనంతరం, మేఘాలయా నుంచి తన పుట్టినిల్లు ఉత్తరప్రదేశ్‌ వచ్చేందుకు సోనమ్‌ రఘువంశీ బురఖా ధరించి సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ప్రయాణం సమయంలో కనీసం ఎక్కడా తినకుండా నిర్విరామంగా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో ఆమెను బోర్డర్‌ దాటించిన వెహికల్‌ డ్రైవర్‌ చెప్పాడు.

రాజా రఘువంశీ కేసును మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇండోర్‌లో సోనమ్‌ రఘువంశీని ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకొచ్చిన కారు డ్రైవర్లు మోహిత్‌,పియూష్‌లను అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్‌ ఏజెన్సీలో పనిచేసిన మోహిత్‌ను పోలీసులు విచారించారు.

సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ‘జూన్‌ 8 మేఘాలయా నుంచి ఉత్తర ప్రదేశ్‌కు చేర్చేందుకు తీసుకెళ్లేందుకు ఎర్టిగో మాట్లాడుకున్నారు.  రాజ్ సూచన మేరకు మోహిత్, పియూష్‌ ఆమెను తీసుకెళ్లారు. ప్రయాణం నిమిత్తం నన్ను(మోహిత్‌),పియూష్‌ని పనిలోకి తీసుకున్నారు. అప్పటికే మేఘాలయ సోహ్రాలోని ఓ లోయలో కుళ్ళిన రాజా రఘువంశీ  రాజ్ మృతదేహాం లభ్యమై ఏడు రోజులవుతుంది.

ఇక ఎర్టిగోలో మా ప్రయాణం ప్రారంభమైంది. సోనం బుర్ఖాలో మారువేషంలో ఉంది. మేం ఏదైనా తినాలని రోడ్డు పక్కన కారు ఆపినా అందుకు ఒప్పుకోలేదు. ఇలా మేఘాలయ నుండి వారణాసికి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం జరిగింది. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు సోనంను ప్రశ్నిస్తున్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే ఇన్ని వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించిందా? తాజా పరిణామంతో రాజా రఘువంశీ హత్యలో కూడా ఆమె ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)