Breaking News

మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?

Published on Thu, 04/17/2025 - 20:21

షెగావ్: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు కొత్త చిక్కొచ్చిపడింది. ఆ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన వింత పరిస్థితి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.. అప్పుడు జుట్టు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఇప్పుడు గోళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.

గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి బట్టతల కూడా వచ్చేసింది. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోయింది. జిల్లాలోని షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా  జుట్టు సమస్య కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, మరో సమస్యతో ఆ గ్రామాలు భయపడుతున్నాయి.

ఇప్పుడు నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్లు రాలిపోవడం, ముడతలు పడటం వంటి కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి పరీక్షల కోసం షెగావ్‌ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సమస్యకు కారణం సెలీనియం స్థాయిలు పెరగడమే కారణంగా భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఇక్కడి గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోవడం,  గోళ్లు రాలిపోవడానికా కారణం.. వారు తింటున్న గోధుములకు సంబంధముందని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ గోధుమల్లో సెలీనియం అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. గతంలో విపరీతంగా జుట్టు కోల్పోయిన వారిలో అనేక మంది ఇప్పుడు గోళ్ల సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)