Breaking News

అంతం చేసింది అత్త కొడుకే..

Published on Wed, 01/04/2023 - 06:54

యశవంతపుర: ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన ఇంజినీరింగ్‌ విద్యారి్థని హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దిబ్బూరు గ్రామంలోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతున్న కోలారుకు చెందిన లయస్మితను మరో కళాశాలలో చదువున్న పవన్‌ అనే యువకుడు హత్య చేశాడు. నిందితుడిని లయస్మిత మేనత్త కొడుకుగా పోలీసులు గుర్తించారు. ప్రేమను నిరాకరించిందనే ఆక్రోశంతోనే ఘోరానికి తెగబడ్డాడని తేలింది.  

మరో విద్యార్థి ఐడీ కార్డుతో కళాశాలలోకి ప్రవేశం  
ఇతరులు కాలేజీలోనికి వెళ్లటానికి అవకాశంలేదు. హత్య చేసిన పవన్‌  ఎలా లోపలకు వెళ్లాడనే విషయంపై అరా తీయగా మరో విద్యార్థి ఐడీ కార్డును ఉపయోగించుకుని కాలేజీలోకి వెళ్లాడు. ప్రెసిడెన్సీ కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు సహకరించటం వల్ల లోపలకు వెళ్లి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు కాలేజీ గేట్‌వద్దకు వెళ్లాడు. అక్కడ మరో విద్యార్థిని పరిచయం చేసుకున్నారు. అతడి కాలేజీ ఐడీతో లోపలకు వెళ్లి లయస్మిత తరగతి గది వద్దకు వెళ్లాడు. 

ఆమె గది నుంచి బయటకు వస్తుండగానే కత్తితో గుండెపై పొడిచాడు. అయితే నిందితుడి వద్ద ఉన్న ఐడీ కార్డు ఎవరిదనే విషయంపై పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే లయస్మిత తండ్రి నాగరాజు మూడు నెలల క్రితమే మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కూతుర్లు. లయను ఇంజినీరింగ్‌ చదివిస్తున్నారు. పవన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)