Breaking News

బిహార్‌ పోరులో మాయావతి 

Published on Fri, 11/07/2025 - 05:55

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు తొలి దశ వరకు ఎక్కడా కనిపించని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి రెండో దశ ఎన్నికలకు  శంఖారావం పూరించారు. తొలి దశ ఓటింగ్‌ జరిగిన గురువారం నుంచే ఆమె ఎన్నికల ప్రచారాన్ని కైమూర్‌ జిల్లా భబువా నుంచి ప్రారంభించారు. రెండో దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్‌ను ఆనుకుని ఉన్నవే. దీంతో ఈ ప్రాంతాలపై ఆమె దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఎవరి గెలుపును అడ్డుకుంటుందో..? 
బిహార్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని అందరి కంటే ముందుగానే ప్రకటించిన బీఎస్పీ అందుకు తగ్గట్లుగానే అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొన్ని చోట్ల నామినేషన్లు  తిరస్కరణకు గురికాగా 190 చోట్ల ప్రస్తుతం బరిలో ఉంది. ఇందులో రెండో విడతలో ఎన్నికలు జరిగే 122 స్థానాలకు గానూ బీఎస్సీ వంద చోట్ల పోటీలో ఉంది. గత 20 ఏళ్లుగా బిహార్‌ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నా రెండంకెల స్థానాలను ఎన్నడూ గెలుచుకోలేదు. 

2000 ఎన్నికల్లో 5 స్థానాలను, 2020 ఎన్నికల్లో ఒక్క స్థానంలో విజయం సాధించింది. గడిచిన ఎన్నికల్లో ఎంఐఎం, రాష్ట్రీయ్‌ లోక్‌ సమతా పార్టీలతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ 1.49 శాతం ఓట్లనుు సాధించింది. బీఎస్పీ పోటీ చేసిన 78 స్థానాల్లో చాలా చోట్ల 4.5 శాతానికి పైగా ఓట్లు సాధించి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ కూటమి ఓట్లకు గండి కొట్టింది. బీఎస్పీ పోటీ చేసిన స్థానాలన్నీ ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్న స్థానాలే కావడంతో అక్కడ ఓట్ల చీలిక ఆ పార్టీల గెలుపు అవకాశాలకు దెబ్బకొట్టింది. 

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న బిహార్‌లోని సరన్, సివాన్, గోపాల్‌గంజ్, భోజ్‌పూర్, పశి్చమ చంపారన్, రోహ్‌తాస్, బక్సర్, కైమూర్‌ జిల్లాల్లోని నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఈ జిల్లాల్లో భోజ్‌పురి మాండలికం, జీవనశైలి, సాంస్కృతిక రీతులు చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని కుల, రాజకీయ పరిస్థితులు సారూప్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తన తొలి ఎన్నికల ర్యాలీని కైమూర్‌ నుంచి మొదలుపెట్టారు. ఈ జిల్లాలోని భబువా, మోహానియా, రామ్‌గఢ్, చైన్పూర్‌ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. 

గతంలో చైన్పూర్‌లో రెండుసార్లు బీఎస్పీ అభ్యర్థులు గెలిచారు. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల కంటే బీఎస్పీ బలంగా ఉండటంతో ఇక్కడే రాజకీయ ర్యాలీకి మాయావతి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా బీఎస్పీకి తొలినుంచి అండగా నిలిచిన ఎస్సీ వర్గాలతో పాటు మైనార్టీలను కలుపుకునేలా బీఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో 15.5 శాతం ఎస్సీలు, 17.70శాతం ముస్లింలు కలిపి 32శాతం పైగా ఉండటంతో బీఎస్పీ వీరు అధికంగా ఉన్న సీట్లనే ఫోకస్‌ చేయనుంది. అదే జరిగితే ముస్లిం ఓట్లను నమ్ముకున్న కాంగ్రెస్, ఆర్‌జేడీల ఓట్లకు గండి పడటం ఖాయంగా కనిపిస్తోంది.   
 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)