Breaking News

అన్నా చెల్లెళ్ల ‘లవ్ స్టోరీ’ అలా ముగిసింది!

Published on Thu, 07/24/2025 - 11:48

తమిళనాడు: తిరుపోరూర్‌ పక్కన ఉన్న తండలం పంచాయతీకి చెందిన సెల్వరాజ్‌ కుమారుడు సురేంద్రన్‌ (28). అతనూ షోలింగనల్లూర్‌లో నివసించే బంధువు ప్రియాంక (25) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇంజినీర్‌ అయిన ప్రియాంక, పోరూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. సురేంద్రన్‌ తల్లి, ప్రియాంక తల్లి అక్కాచెల్లెళ్లు. దీంతో ఆ కుటుంబాల్లో ఎవరూ సురేంద్రన్, ప్రియాంక  స్నేహాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది.

 ఈ విషయం వారికి తెలియగానే రెండు కుటుంబాలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి మధ్య ప్రేమ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని హెచ్చరించాయి. అయితే అప్పటికే ప్రియాంక గర్భవతి అయింది. దీంతో తమ వివాహానికి సమ్మతి తెలపాలని ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులను కోరారు. కానీ రెండు కుటుంబాలు దీనిని వ్యతిరేకించాయి. అంతేకాకుండా ప్రియాంక 8 నెలల గర్భవతి కావడంతో గర్భాన్ని తొలగించడం అసాధ్యంగా మారింది. దీని కారణంగా, ప్రేమికులిద్దరూ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. 

ఇదే సమయంలో ఎంతకూ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సురేంద్రన్, ప్రియాంక మనస్తాపంతో మంగళవారం రాత్రి తండలం ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. బయటకు వెళ్లిన సురేంద్రన్‌ తిరిగి రాకపోయేసరికి, అతని బంధువులకు అనుమానం వచ్చి అతని కోసం వెతకడానికి వెళ్లారు. స్థానికంగా ఉండే పంపు సెట్‌ రూంలో సురేంద్రన్, ప్రియాంక మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ సంఘటన గురించి తిరుపోరూర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)