Breaking News

అన్న విదేశాలకు.. వదినపై కన్నేసిన మరిది..

Published on Wed, 09/20/2023 - 09:56

యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక మహిళకు సంబంధించిన హృదయవిదారకగాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన భర్త విదేశాల్లో ఉంటున్నాడని, తనను అత్తింటివారు ఇంటిలోనికి రానీయడం లేదని ఆమె ఆరోపిస్తోంది. అలాగే తన మరిది తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. అతనికి సహకరించకపోవడంతో తనను కాల్‌గర్ల్‌ అని చెబుతూ, తన ఫోను నంబర్‌ వైరల్‌ చేస్తున్నాడని బాధితురాలు పేర్కొంది.  ప్రస్తుతం ఆమె అత్తింటి వారు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. అయితే బాధిత మహిళ ప్రస్తుతం ఆ ఇంటి ముందు ధర్నా చేస్తోంది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్దోయీలోని బెనీగంజ్‌లో ఉంటున్న బాధిత మహిళకు 2019లో షాజహాన్‌పూర్‌లో ఉంటున్న ఒక యువకునితో వివాహం జరిగింది. పెళ్లయిన నెల్లాళ్ల తరువాత ఆ యువకుడు ఉద్యోగం కోసం ఒమన్‌ దేశం వెళ్లాడు. అది మొదలు అమెను అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. ఆమెపై దాడి చేసి, ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. 

ఈ నేధ్యంలో బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తన మరిది తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, కాల్‌గర్ల్‌ అంటూ తన ఫోన్‌ నంబర్‌ వైరల్‌ చేస్తున్నాడని ఆరోపించారు. ఫలితంగా తనకు లెక్కకుమించిన ఫోన్లు వస్తున్నాయని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగేవరకూ ఈపోరాటాన్ని కొనసాగిస్తానని అమె తెలిపింది. ఆమె తన 3 ఏళ్ల కుమారుడిని కూడా ధర్నాలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది. కాగా ఈ సమస్యపై తాను ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. బాధితురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన బావ విదేశాల్లో ఉంటున్నాడని, తన సోదరిని అతను తీసుకువెళతాడని భావిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: ‘లోకల్‌’లో యువతి ‘బెల్లీ’ డాన్స్‌.. పోలీసులకు నెటిజన్ల ఫిర్యాదు! 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)