Breaking News

విడిపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు

Published on Sat, 11/30/2024 - 05:20

న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమై వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే.. ఆ బంధం విడిపోవడమే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోవడం అనేది నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని స్పష్టంచేసింది. సెక్షన్‌ ప్రకారం 306 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించగలమని వెల్లడించింది. 

ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన కమ్రుద్దీన్‌ దస్తగిర్‌ సనాదీ, మరో మహిళ ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. 2007 ఆగస్టులో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమ్రుద్దీన్‌ అరెస్టయ్యాడు. అతడిౖపై ఐపీసీ సెక్షన్‌ 417(మోసం), సెక్షన్‌ 306(ఆత్మహత్యకు పురికొల్పడం), సెక్షన్‌ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. 

కమ్రుద్దీన్‌ నిర్దోషి అని గుర్తిస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్‌ చేస్తూ పోలీసులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కమ్రుద్దీన్‌ను దోషిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ.25 వేల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది బంధం విడిపోయిన కేసు తప్ప నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)