Breaking News

పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే..  

Published on Wed, 07/12/2023 - 12:43

న్యూడిల్లి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఇప్పటికే చార్జి షీటు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను కటకటాల వెనక్కు పంపే ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా సేకరించినట్లు చెబుతున్నారు. 

మైనర్ రెజ్లర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో రెజ్లర్లు ఉధృత స్థాయిలో నిరసనలు తెలియజేయడంతో ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేసి వెయ్యి పేజీల ఛార్జిషీటును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు సుమారు 100 మంది వాంగ్మూలాలను  సేకరించినట్లు వారిలో 15 మంది ఇచ్చిన వాంగ్మూలాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు. 

ఈ సాక్ష్యాలను ఢిల్లీ కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపిన ఢిల్లీ పోలీసులు నేరం రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని తెలిపారు. ఒకవేళ నేరం రుజువైతే మాత్రం బ్రిజ్ భూషణ్ కు మూడేళ్ళ నుండి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంటుందని అన్నారు. 

అసలే నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కాస్తంత క్రమశిక్షణతో వ్యవహరించాల్సింది పోయి ఇటీవల ఒక విలేఖరిపైన అనుచితంగా వ్యవహరించడంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. జూలై 18 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు కూడా అందుకున్న బ్రిజ్ భూషణ్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. నేరుగా కోర్టులోనే మాట్లాడతానని అన్నారు.  

ఇది కూడా చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్‌.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)