Breaking News

పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు!

Published on Mon, 06/26/2023 - 18:21

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే ఓ వేడక. అందుకే జీవితంలో ఇది మర్చిపోలేని రోజుల్లో ఒకటిగా పేర్కొంటుంటారు. అంతటి విశిష్టత ఉంది కనుకే పెళ్లి రోజు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఇక భారతీయ వివాహాలపై ఓ లుక్కేస్తే అందులో జరిగే హడావుడి మామూలుగా ఉండదు. వధూవరుల కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు, తతంగాలను చేస్తూ అలిసిపోతే, వధూవరులు మాత్రం పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని అలిసిపోతారు. ఇక రాత్రివేళ ముహూర్తాలు ఉన్న సమయంలో వధూవరుల అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తాజాగా ఓ వధువు తన పెళ్లిరోజు మండపంలో చేసిన పని అందరికీ నవ్వ తెప్పించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఆ వీడియో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ మండపంలో వరుడు వివాహ కార్యక్రమాలలో తతంగాలలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వధువు కూడా బిజీగా ఉందనుకుంటే పొరపడినట్లే. అంతవరకు జరిగిన కార్యక్రమాల్లో వధువు పాల్గొని అలిసిపోయిందేమో గానీ ఆమె మాత్రం ఓ కూర్చీలో పడుకుని ఆదమరిచి నిద్రపోతోంది. పెళ్లికి వచ్చిన వారిలో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. 

పవర్ నాప్ అంటే ఇదే అంటూ వీడియోలో కామెంట్‌ కూడా ఆ వీడియోకి జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నె‍ట్టంట హల్‌ చల్‌ చేస్తోంది. ఇక నెటిజన్లు వధువు పరిస్థితి చూసి పడిపడీ నవ్వుకుంటున్నారు. పాపం నిద్ర వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం పెళ్లికూతురిని ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి పెట్టుకుని ఇదేం పనంటూ సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
 

చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్‌.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)