Breaking News

నేను అమన్‌ సొంతం.. నాకు అల్లుడే కావాలి..

Published on Wed, 06/25/2025 - 08:21

లక్నో: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని.. భార్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భర్తకు ఊహించని అనుభవం ఎదురైంది. నాటకీయంగా మొదటి రాత్రి వధువు ప్రవర్తనతో వరుడు ఖంగుతిన్నాడు. ‘నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా.. నేను అమన్‌కు మాత్రమే సొంతం’ అంటూ భర్తకు భార్య వార్నింగ్‌ ఇచ్చింది. అనంతరం, అర్ధరాత్రి ఇంట్లో నుంచి నవ వధువు పరారీ అయ్యింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడీఏ కాలనీకి చెందిన కెప్టెన్ నిషాద్ ఏప్రిల్ 29న సితారను వివాహం చేసుకున్నాడు. అనంతరం, ఏప్రిల్ 30న వధువు తన అత్తమామల ఇంటికి చేరుకుంది. మే రెండో తేదీన కొత్త జంటలకు ఘనంగా రిసెప్షన్ జరిగింది. తర్వాత, కుటుంబ సభ్యులు వారిద్దరూ మొదటి రాత్రికి ఏర్పాటు చేశారు. కొత్త జంటకు లోపలికి వెళ్లగానే.. వరుడికి ఊహించని అనుభవం ఎదురైంది. వధవు..‘నన్ను ముట్టుకుంటే.. నువ్వు 35 ముక్కలుగా కనిపిస్తావు. నేను అమన్‌ను ప్రేమిస్తున్నా. నేను అమన్‌ సొంతం’ అని సితార తన భర్తను కత్తితో బెదిరించింది. ఈ అనూహ్య ఘటనతో ఖంగుతిన్న నిషాద్‌కు ఏం చేయాలో తెలియక సైలెంట్‌ అయిపోయాడు. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబసభ్యులపైనా బెదిరింపులకు పాల్పడింది.

దీంతో మరుసటిరోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్‌ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా.. సితారకు అమన్‌ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. 

ఈ ఘటన అనంతరం, భర్త నిషాద్‌ మాట్లాడుతూ..‘నేను గదిలోకి వెళ్లగానే ఆమె నిశ్శబ్దంగా పూర్తిగా ముసుగు వేసుకుని కత్తి పట్టుకుని కూర్చుని ఉంది. ఆమె నాతో సూటిగా ఒక్కటే చెప్పింది. నన్ను ముట్టుకోవద్దు. నేను అమన్ ఆస్తిని. నువ్వు నన్ను తాకాలని ప్రయత్నిస్త.. నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తాను అని బెదిరించింది. నన్ను అమన్ వద్దకు పంపించు అని చెప్పింది. దాంతో, నాకు ఏం చేయాలో తోచలేదు. ఆ రాత్రంతా ఆమె కత్తితో మంచం మీద ఉండగా నేను సోఫాలో కూర్చున్నాను. నిద్రపోయే ధైర్యం చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఆమె ప్రవర్తనపై అటు నిషాద్‌ పేరెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)