Breaking News

పెళ్లిలో కుప్పకూలి వధువు మృతి.. సోదరితో వివాహం

Published on Fri, 02/24/2023 - 21:37

విధి రాతను ఎవరూ మర్చలేరని అంటుంటారు. మనిషి జీవితంలో కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే విధి మరోలా తలుస్తుంది. ఒక్క ఘటన మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే పెళ్లింట విషాదాన్ని నింపింది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు గుండెపోటుతో మరణించింది.. అయినా పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడుకి వధువు కుటుంబం మరో ఆఫర్‌ ఇవ్వడంతో ముహుర్తం సమాయానికి వివాహం​ జరిగింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని భావనగర్‌ జిల్లాలోని సుభాష్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన జినాభాయ్‌ భాకాభాయ్‌ రాథోడ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, వివాహ వయసు రాగానే తన పెద్ద కూతురుకు హేతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్‌తో పెళ్లి ఫిక్స్‌ చేశారు. కాగా, ముహుర్తం ప్రకారం.. వీరికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కొన్ని గంటల్లో పెళ్లి అనగా వరుడు విశాల్‌.. వధువు ఇంటికి ఊరేగింపుగా బయలుదేరాడు. 

వరుడు విశాల్‌ ఎంతో ఆనందంలో ఎన్నో ఆశలతో బంధువులతో కలిసి బ్యాండ్‌ మేళాల మధ్య పెళ్లి వేడుకకు వద్దకు చేరుకున్నాడు. దీంతో, పెళ్లి ఇంట అందరూ ఎంతో ఆనందంగా ఉన్నవేళ.. పెళ్లి కూతురు ఒక్కసారిగా స్పృహ తప్పి కూప్పకూలింది. దీంతో, కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. వధువు అప్పటికే మృతిచెందినట్టు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, వధువుకు గుండెపోటు రావడంతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. 

ఇదిలా ఉన్న సమయంలో వధువు కుటుంబం.. తన కూతురు చనిపోయిన బాధను దిగమింగుకుంది. పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్‌కు తన కూతురుతో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ నిర్ణయాన్ని వరుడు కుటుంబం కూడా ఒప్పుకుంది. దీంతో, హేతల్‌ డెడ్‌బాడీని మార్చురీలో భద్రపరిచి.. మరో ముహుర్తం పెట్టించి శుక్రవారం పెళ్లి జరిపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)