మటన్ కర్రీ కోసం వరుడి గొడవ.. పెళ్లిని రద్దు చేసిన వధువు..

Published on Fri, 06/16/2023 - 15:09

ఒడిశా:మటన్ కర్రీపై గొడవ కారణంగా పెళ్లిని రద్దు చేసింది ఓ వధువు. వరుడు అతని స్నేహితులు మటన్‌ కోసం తన కుటుంబంపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా వధువు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన ఒడిశా సంబల్‌పూర్ జిల్లాలోని ధామా ప్రాంతంలో జరిగింది.

స్థానిక వివరాల ప్రకారం.. అంగరంగవైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూలు, పందిళ్లు, బంధువులతో ఇళ్లంతా సందడిగా ఉంది. రుచికరమైన వంటకాలు వడ్డించారు. పెళ్లికి వచ్చినవారికి లేదనకుండా భోజనాలు పెట్టారు. పెళ్లి అయ్యాక రాత్రిలో వరుడి స్నేహితులు ఆరుగులు భోజనాలకు వచ్చారు. అప్పటికే మటన్ కర్రీ ‍అయిపోయింది. దీంతో వారు పెళ్లికూతురు కుటుంబంపై వాగ్వాదానికి దిగారు. మటన్ కూర పెట్టాల్సిందేనని వధువు తండ్రిని అవమానించారు. వరుడు కూడా అతని స్నేహితులకు వంత పాడాడు. దీంతో వధువు పెళ్లిని రద్దు చేసింది. అయితే.. వరుడు జాతీయ స్థాయి బ్యాంకులో పనిచేస్తాడని స్థానికులు తెలిపారు.

'పెళ్లి అంతా బాగానే అయింది. మటన్‌తో పాటు అన్ని వంటకాలు అందరికీ సరిపోయాయి. చివరగా వచ్చిన ఓ ఆరుగురికి మాత్రం సరిపోలేదు. రాత్రి అయినందున వడ్డించలేకపోయాము. పెళ్లికొడుకుతో సహా అతని స్నేహితులు మా కుటుంబాన్ని అవమానించారు. నాన్నపై దురుసుగా ప్రవర్తించారు. కుటుంబంలో పెద్దవారిని గౌరవించలేనివారితో నేను ఎలా భద్రతను పొందగలను?' అని వధువు అంటోంది.

ఇదీ చదవండి:యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)