Breaking News

Ganesh Chaturthi: మండపాల్లో ‘ఫ్రీ శాంపిల్స్‌’.. ఎగబడుతున్న జనం

Published on Mon, 09/01/2025 - 11:50

ముంబై: గణపతి నవరాత్రులు మహారాష్ట్రంలోని ముంబైని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాడవాడలా ఏర్పాటైన గణేశ్‌ మండపాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. దీనికితోడు అక్కడ హోరెత్తిస్తున్న భక్తి పాటలు, డప్పుశబ్ధాలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. అయితే ఈ ఉత్సవాలు వ్యాపారవర్గాలకూ భలే కలిసి వస్తున్నాయి. వివిధ సంస్థలు పనిలో పనిగా వివిధ గణేశ్‌ మండపాల్లో తమ బ్రండ్‌లకు ప్రమోషన్‌ చేసుకుంటున్నారు.

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాల నుండి రియల్ ఎస్టేట్ సంస్థల వరకు అన్ని కంపెనీలు ఉత్సవాల్లో తమ బ్రాండ్‌లకు ప్రచారం కల్పించుకుంటున్నారు. కిరాణా సామగ్రిని విక్రయించే కొన్ని క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు పది నిమిషాల్లో డెలివరీ పేరుతో వినాయక పూజకు సంబంధించిన సామగ్రితో పాటు మోదకాలను కూడా విరివిగా విక్రయిస్తున్నాయి. తమ కంపెనీల స్థాళ్లను వినాయక మండపాల వద్ద పెట్టి, వినియోగదారులను వివిధ ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి.

ప్రముఖ బిస్కెట్లు, స్వీట్ల కంపెనీ గణేశ్‌ మండపాల వద్ద తమ బ్రాండ్‌ స్టాల్స్‌ పెట్టి, అక్కడికి వచ్చే భక్తులకు శాంపిల్స్‌ను అందిస్తున్నాయి. అలాగే తమ వంటకాల రుచులను కూడా చూపిస్తున్నాయి. మోదక్‌ చాక్లెట్ల పేరుతో వినియోగదారులకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ‘ఆర్గానిక్ తత్త్వ’ అనే కంపెనీ వినాయక ఉత్సవాలనే టార్గెట్‌గా చేసుకుని తమ ఉత్పత్తులకు విరివిగా ప్రచారం కల్పిస్తోంది. ఆర్గానిక్‌ బెల్లం, పప్పు దినుసులను విక్రయిస్తోంది.

ఒక ప్రముఖ పెయింటింగ్‌ కంపెనీ రాబోయే దీపావళికి మీ ఇంటికి  మా రంగులు వేయించుకోండి అంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఆఫర్లు కూడా ప్రకటించింది. దీనిని ప్రతిబింబించేలా ఒక ప్రకటన కూడా రూపొందించి గణేశ్‌ మండపాల వద్ద ప్రదర్శిస్తోంది. ఒక వంట నూనెల సంస్థ.. తమ ఆయిల్‌తో వంటకాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయని చెబుతూ, మండపాలకు వచ్చే భక్తులకు వివిధ శాంపిల్‌ రుచులను చూపిస్తోంది. ఈ విధమైన బ్రాండ్‌ల ప్రచారాన్ని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మనకెందుకులే అనుకుంటూ, మండపాల వద్ద బ్రాండ్‌ శాంపిల్స్‌ తీసుకుంటూ మురిసిపోతున్నారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)