Breaking News

బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్‌ డెడ్‌ తల్లి..

Published on Mon, 02/17/2025 - 12:00

తల్లికి తన పిల్లలే సర్వస్వం అని అంటారు. తనకు పుట్టిన బిడ్డను తొలిసారి ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి లోకాన్ని జయించినంతగా మురిసిపోతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఆషితా చందక్‌(38) కథ దీనికి  భిన్నమైనది. దీనిని విన్నవారంతా కంటతడి పెడుతున్నారు. ఆషితా చందక్‌ కొద్ది రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. ఇందుకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది.  బిడ్డను కని, ఎప్పుడెప్పుడు ఒడిలోకి తీసుకుంటానా అని ఆమె ఎదురుచూసింది. అయితే ఎనిమిదినెలల గర్భవతి అయిన ఆషితా విషయంలో విధి కన్నెర్రజేసింది. తన బిడ్డను చూసుకోకుండానే ఆమె ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించింది. ఆషితా కుటుంబ సభ్యులు ఆమె ఇంతలోనే తమకు దూరమవుతుందనే విషయాన్ని నమ్మలేకున్నారు.

ఆషితా ఢిల్లీలోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో కస్టమర్‌ సపోర్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. పెళ్లయిన ఎనిమిదేళ్త తరువాత ఆమె గర్భం దాల్చింది. ఫిబ్రవరి 7న ఆషిత ఉన్నట్టుండి బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.  ఆషిత 8 నెలల గర్భవతి. కొన్ని వారాల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనందున వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే శిశువును వెంటిలేటర్‌ సపోర్ట్‌తో ఐసీయీలో ఉంచి చికిత్ప అందించారు. ఫిబ్రవరి 13న ఆషితా బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్థారించారు.

ఆషితా కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఆషితా భర్త రాజుల్‌ రామ్‌పాట్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. మెదడు పూర్తిగా పనిచేయడం మానేసిన బాధితుడు లేదా బాధితురాలిని వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటిస్తారు. అటువంటి స్థితిలో మెదడులో ఎటువంటి చురుకుదనం ఉండదు. దేనినైనా అర్థం చేసుకునే సామర్థ్యం, శరీరానికి  సంకేతాలను పంపే సామర్థ్యం పూర్తిగా పోతుంది. వైద్యులు ఎవరినైనా  బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారంటే వారు  దాదాపు చనిపోయారని అర్థం.

ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)