Breaking News

ముక్కులోంచి వెళ్లి మెదడు తినేసింది.. 15 ఏళ్ల కుర్రాడు మృతి!

Published on Mon, 07/10/2023 - 13:50

కేరళలోని అలప్పుజా జిల్లాలో జరిగిన ఒక ఘటన అందరిలో కలవరాన్ని పెంచింది. కలుషిత నీటిలో ఉండే అమీబా ఒక యువకుని ప్రాణాలను బలిగొంది.  ఈ అమీబా ఆ కుర్రాడి మెదడులో నిన్ఫెక్షన్‌ను వ్యాపింపజేసింది. అది మెదడును తిసేసింది. కేరళ ఆరోగ్యశాఖమంత్రి వీణా జార్జ్‌ తెలిపిన వివరాల ప్రకారం అలప్పుజా జిల్లాకు సమీపంలోని పనావల్లికి చెందిన కుర్రాడు ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడ్డాడు. 

గతంలోనూ ఇటువంటి కేసులు..
గతంలోనూ ఇటువంటి ఐదు కేసులు వెలుగు చూశాయి. దీనిలో మొదటి కేసు 2016లో తిరమాల వార్డులో వెలుగు చూడగా, 2019, 2020లలో మలప్పురంలో రెండేసే కేసులు చొప్పున వెలుగు చూశాయని మంత్రి తెలిపారు. 2020, 2022లలో కోజికోడ్‌, త్రిశూర్‌లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యింది. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ సోకినవారంతా మృత్యువాత పడ్డారు. 

ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి..
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాగా వ్యాధి తీవ్రతను గమనించిన అలప్పుజా జిల్లా వైద్యశాఖ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు.  కలుషిత నీటితో స్నానం చేయవద్దని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుడు జ్వరం, తలనొప్పి, వాంతులు మొదలైన సమస్యలను ఎదుర్కొంటాడని వారు తెలిపారు. 

సూక్ష్మదర్శినితో మాత్రమే..
ఈ అమీబా ఎంత ప్రమాదకరమంటే ఇది మెదడులోని కణాలను తినేస్తుంది. ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తుంది. ఇది బాధితుడికి ప్రాణహాని కలిగిస్తుంది. Naegleria Fowleri అనే ఈ అమీబా చాలా చిన్నగా  ఉంటుంది. దీనిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతారు. 
ఇది కూడా చదవండి: అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే..

#

Tags : 1

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు