Breaking News

విషాదం: డీజే సౌండ్‌కు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు

Published on Thu, 10/17/2024 - 15:37

ఇటీవల డీజే ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి శుభకార్యంలో భారీ భారీ సౌండ్‌ సిస్టమ్‌ కామన్‌ అయిపోయింది. దద్దరిల్లిపోయే డీజే చప్పుళ్లకు చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. మితిమీరిన సౌండ్‌, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ బాలుడు భారీ డీజే సౌండ్‌కు డాన్స్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

భోపాల్‌లో సమర్‌ బిల్లోర్‌ అనే 13 ఏళ్ల బాలుడు స్థానిక పండుగ వేడుకలో తన వివాసం వెలుపల డీజే సౌండ్‌కు ప్రజలు డ్యాన్స్‌ చేస్తుండగా.. ఆ సంగీతానికి ఆకర్షితుతయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అందరితోపాటు డ్యాన్స్‌ చేశాడు. అలా డ్యాన్స్‌ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పిల్లవాడని ఆరోగ్య పరిస్థితి గురించి తెలియక అతని చుట్టుపక్కల వారు డ్యాన్స్‌ చేస్తూనే ఉన్నారు. అయితే గమనించిన తల్లి జమునా దేవి సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో అందరూ ఆగిపోయారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యు ప్రకటించారు.

అయితే సమర్ తండ్రి, కైలాష్ బిల్లోర్, డీసే సౌండ్  అత్యంత ప్రమాదకరంగా ఉండటమే తన కొడుకు చావుకు కారణమని ఆరోపించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్‌ సిస్టమ్స్‌ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇటువంటి సమస్యలను నివారించడానికి డీజేలకు ఖచ్చితమైన సమయం, వాల్యూమ్ పరిమితులు ఉండాలని కోరారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)