Breaking News

పోలీస్ స్టేషన్ పైనే యువకుల ట్రెండింగ్ వీడియో.. చివరికి..

Published on Tue, 08/15/2023 - 21:17

తిరువనంతపురం: సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం తెగ పరితపిస్తుంటారు. వినూత్న రీతిలో వీడియోలు పెడుతూ లైకులు, వ్యూస్ చూసుకుని సంబరపడిపోతుంటారు. ఈ మైకంలోపడి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. ఇలాగే సోషల్ మీడియా పిచ్చి కేరళ యువకులను కటకటాలపాలు చేసింది. ఇంతకూ వారు ఏం చేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..?

ఖాలీగా ఉన్న సమయాన్ని ఏం చేయాలో తెలియని ఐదుగురు యువకులు ట్రెండ్ అయ్యే వీడియో చేయాలనుకున్నారు. అందుకు ఏకంగా పోలీసు స్టేషన్‌నే ఎంచుకున్నారు. తమకు తెలిసిన యానిమేషన్ స్కిల్స్ ఉపయోగించి స్టేషన్‌లో బాంబు పేలుడు సంభవించినట్లు ఓ వీడియో తయారు చేశారు. అంతేకాకుండా సినిమాల్లోని వచ్చే పాపులర్ డైలాగ్‌లను ఉపయోగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అది కాస్త ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో విపరీతంగా వైరల్‌ అయింది. దీంతో అది పోలీసుల కంట పడింది.

దర్యాప్తు చేపట్టిన స్థానిక మేలట్టూరు పోలీసులు.. మహ్మద్ రియాజ్‌(25), మహ్మద్ ఫావేజ్(22), మహ్మద్ జాష్మైన్‌(19), సాలిమ్‌ జిషాజియాన్‌(20), సాల్మానుల్ పారిస్‌(19)లను నిందితులుగా గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే ఇదంతా చేశారని పోలీసులు గుర్తించారు. ఐదుగుర్ని అరెస్టు చేశారు.  

ఇదీ చదవండి: విరిగిపడిన కొండచరియలు.. కుప్పకూలిన ఇళ్లు.. వీడియో వైరల్..

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి