పలు నగరాల్లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Published on Fri, 01/23/2026 - 11:56

గణతంత్ర దినోత్సవ వేడుకలకు యావద్దేశం సిద్ధమవుతున్న వేళ అహ్మదాబాద్, నోయిడాలలోని పలు ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం  ఆ ప్రాంతాలలో తీవ్రకలకలం రేపింది. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన భద్రత బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని తనిఖీలు చేపడుతున్నాయి.

శుక్రవారం ఉదయం గుజరాత్‌లోని పలు ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లలో పేలుడు పదార్థాలు పెట్టామంటూ ఫోన్‌లతో పాటు మెయిల్స్ రావడంతో స్కూల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ‍అక్కడికి చేరుకున్న పోలీసులు పిల్లలతో పాటు సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌ బృందాలతో గాలింపులు చేపడుతున్నారు. అదేవిధంగా ఇదే తరహా బాంబు బెదిరింపు నోయిడాలోని శివనాడర్ పాఠశాలకు వచ్చింది. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన పిల్లలను వారి ఇండ్లకు తరలించారు.  బాంబ్‌స్క్వాడ్ బృందాలు  అక్కడికి చేరుకొని  సోదాలు జరుపుతున్నాయి.

అయితే గతేడాది ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడుల నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అనంతరం జరిపిన విచారణలో ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)