Breaking News

Delhi: 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. వారంలో రెండో ఘటన

Published on Wed, 08/20/2025 - 10:01

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని 50 కి పైగా పాఠశాలలకు బుధవారం ఉదయం ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే ఏ పాఠశాలలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయో స్పష్టంగా తెలియకపోయినా, వాటిలో మాలవీయ నగర్‌, నజాఫ్‌గఢ్‌లోని పాఠశాలలు ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలోని సర్వోదయ కన్యా విద్యాలయ (ఎస్‌కేవీ)కి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ , భద్రతా సిబ్బంది పాఠశాలకు చేరుకుని, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నగరంలోని 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడాన్ని మరచిపోకముందే,  తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో వివిధ పాఠశాలల్లో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.

గడచిన సోమవారం నగరంలో 32 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా, సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పరుగుపరుగున పాఠశాలలకు చేరుకుని, తమ పిల్లలను  ఇంటికీ తీసుకెళ్లారు. తాజాగా పాఠశాలలకు తిరిగి బాంబు బెదిరింపులు వచ్చిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారని, ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయిని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)