Breaking News

ఢిల్లీ కోర్టులకు బాంబు బెదిరింపులు.. విస్తృతంగా తనిఖీలు

Published on Tue, 11/18/2025 - 12:09

న్యూఢిల్లీ సాక్షి, దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ కోర్టులో బాంబు పెట్టామంటూ మెయిల్ సందేశం వచ్చింది. దానితో పాటు పటియాలా హౌస్ కోర్టు, సాకేట్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు భవనాలను ఖాళీ చేయించారు.  అక్కడ ఉన్న వారందరినీ హుటాహుటీన ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్స్ తో పాటు ఇతర ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.

ఇటీవలే  ఎర్రకోట బాంబుపేలుళ్లతో అట్టుడికిపోయిన దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. నగరంలోని మూడు కోర్టులతో పాటు  ద్వారకా, ప్రశాంత్ విహార్ లలో ఉన్న సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రదేశాలని  ఖాళీ చేయించారు. ప్రత్యేక బృందాలతో సోదాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు భారీ కుట్రలు పన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ బృందాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొవడంతో పాటు ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంతలోనే ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)