Breaking News

Pakistan: బాంబు పేలి ఇద్దరు చిన్నారులు మృతి

Published on Sun, 08/25/2024 - 13:22

పాకిస్తాన్‌లో నిత్యం ఏదో ఒక అలజడి చోటుచేసుకున్నదనే వార్లలను వింటుంటాం. తాజాగా పాక్‌లోని బలూచిస్థాన్ బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు పోలీసులతో సహా 16 మంది గాయపడ్డారు.

పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్‌లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బలూచిస్థాన్‌లోని పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి  మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. యాంటీ టెర్రరిజం డిపార్ట్‌మెంట్, బాంబ్ స్క్వాడ్  విచారణ జరిపి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.

తాజా  ఘటనలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిని ఖండించారు. చిన్నారులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)