Breaking News

ఆమె బ్లడ్‌ గ్రూపు ఎక్కడాలేదు!

Published on Fri, 08/01/2025 - 03:35

కోలారు: కర్ణాటకలోని కోలారు జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ రక్తం గ్రూపు చాలా ప్రత్యేకమైనదిగా తేలింది. ఏ గ్రూపుతోనూ ఆమె రక్తం సరిపోలలేదని స్థానిక జిల్లా ఆస్పత్రి వైద్యనిపుణులు డాక్టర్‌ డీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓ మహిళ గుండె శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని.. ఆమె బ్లడ్‌ గ్రూపును గుర్తించేందుకు పరీక్ష చేయగా బ్లడ్‌బ్యాంకులోని ఏ రక్తం గ్రూపుతోనూ ఆమె రక్తం సరిపోలేదన్నారు. 

ఆమె రక్త నమూనాలను బెంగళూరులోని మెడికల్‌ సర్వీసెస్‌ ట్రస్టుకు, ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌ నగరంలోని అంతర్జాతీయ ల్యాబొరేటరీకి పంపించి ఏ గ్రూపు రక్తమో కనుక్కోవాలని కోరామని.. ఇంతవరకూ ఇలాంటి గ్రూపు రక్తం ఏదీలేదని నివేదిక వచ్చిందని డాక్టర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. 

చివరకు.. ఈ రక్తం గ్రూపునకు స్థానిక పేరు వచ్చేలా క్రోమర్‌ ఇండియా బెంగళూరు (సీఆర్‌ఐబీ)గా వారే పేరు పెట్టారని, బెంగళూరుకు బదులు కోలారు అని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ కె.ప్రభాకర్, వైస్‌ ప్రిన్సిపాల్‌ వినుతా శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు