Breaking News

Rameshwaram Cafe Bomb Blast: రవ్వ ఇడ్లీ తీసుకుని, ‘బ్యాగు’ను వదిలి..

Published on Sat, 03/02/2024 - 09:18

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధించిన ఆసక్తికర మరో అప్‌డేట్‌ ముందుకు వచ్చింది. అనుమానితుడు తన బ్యాగ్‌ను రెస్టారెంట్‌లో ఉంచే ముందు, రవ్వ ఇడ్లీని తీసుకోవడం చూశానని కేఫ్‌ యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు.

రామేశ్వరం కేఫ్‌ వైట్‌ఫీల్డ్ అవుట్‌లెట్‌లో పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని దివ్య రాఘవేంద్రరావు వివరిస్తూ ‘పేలుడు జరిగినప్పుడు నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేదు. నేను దానిని తీసుకోగానే, దానిలో చాలా మిస్డ్ కాల్స్  ఉన్నాయి. నేను మా సిబ్బందికి కాల్‌ చేయగా, వారు రెస్టారెంట్‌లో పేలుడు జరిగిందని చెప్పారు.

తొలుత వంటగదిలో ఏదో కారణంగా పేలుడు సంభవించిందని అనుకున్నాను. కానీ వంటగదిలో పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. దీంతో కస్టమర్లున్న ప్రాంతంలో పేలుడు జరిగిందని  గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక మాస్క్‌, మఫ్లర్‌ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్‌ కౌంటర్‌ వద్దకు వచ్చి, రవ్వ ఇడ్లీ ఆర్డర్‌ చేసినట్లు కనిపించింది.

అతను ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక మూలన కూర్చున్నాడు. ఆ ఇడ్లీలను తీనేశాక, రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లే ముందు  బ్యాగ్‌ను ఒక మూలన ఉంచాడు. ఇది జరిగిన కొద్ది సమయానికే పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన చోట సిలిండర్లు లేవు.

నేను ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చాను. రామేశ్వరం కేఫ్‌, ఈమధ్యనే పుట్టిన నా బిడ్డ.. రెండింటిలో ఎలాంటి తేడా లేదు. మా అవుట్‌లెట్‌కు జరిగిన నష్టం  తీవ్రంగా బాధిస్తోంది. రామేశ్వరం కేఫ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. మరింత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పనిచేస్తుంది. కేఫ్ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగనందుకు దేవునికి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నానని కేఫ్‌ యజమాని దివ్య రాఘవేంద్రరావు పేర్కొన్నారు. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)