భోలే బాబాకు రక్షణగా 'బ్లాక్ కమాండోస్', మహిళా సైన్యం..

Published on Wed, 07/03/2024 - 22:13

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ హత్రాస్‌ తొక్కిసలాటలో 121 మంది మరణానికి కారణమైన భోలే బాబా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తనని తాను స్వయంగా దేవుడిగా ప్రకటించుకున్న భోలే బాబాకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలోని మెయిన్‌పురిలో భారీ మొత్తంలో పొందిన విరాళాలతో నిర్మించిన విశాలమైన ఆశ్రమం ఆయన భక్తులలో ఆయనకున్న పట్టు, ఆదరణకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 

అయితే వివాదాలు ఆయన్ని వెంటాతుండడంతో తన ప్రాణాలు ముప్పు వాటిల్లుతుందనే అనుమానం ఎక్కువగా ఉండేదని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలోని తన ఇంటికి దాదాపు ఎనిమిదేళ్లుగా భోలే బాబా వెళ్లలేదు. అతని చుట్టూ బ్లాక్‌ కమాండో తరహాలో మహిళలు 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు తేలింది.  

ఆశ్రమంలో భోలే బాబాకు ఓ గది ఉంది. అందులో భోలే బాబా ఎంపిక చేసిన ఏడుగురు వ్యక్తులకు మాత్రమే అందులోకి అనుమతించే వారు. ఏడుగురిలో మహిళలు,సేవకులున్నారు.సెక్యూరిటీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా రాత్రి 8 గంటల తర్వాత ఎవరినీ కలవడని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

భోలో బాబాకు రక్షణా ఉండే సిబ్బందికి ఒక కోడ్ వర్డ్, ప్రతి సెక్యూరిటీ స్క్వాడ్‌కి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ ఉంది.నారాయణి సేన, గరుడ్ యోధ, హరి వాహక్ అనే మూడు బృందాలు బాబాను రక్షించడానికి 24 గంటలూ పని చేస్తాయి.

నారాయణి సేనలోని సిబ్బంది గులాబీ రంగు దుస్తులు, గరుడ్ యోధ నల్లని దుస్తులను (స్థానికులు వారిని బ్లాక్‌ కమాండోలు అని పిలుస్తారు.హరి వాహక్ సభ్యులు విలక్షణమైన టోపీలు, గోధుమ రంగు దుస్తులు ధరిస్తారు.

బ్లాక్ కమాండోలు బాబా కాన్వాయ్‌ వెంట ఉంటారు. ఎల్లప్పుడూ 20 మంది పనిచేస్తుంటారు. ప్రతి నారాయణి సేనలో 50 మంది సభ్యులు, హరి వాహక్ సభ్యులు ఒక్కొక్కరు 25 మందితో కూడిన బృందాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)