Breaking News

బ్లాక్‌బాక్స్‌ నుంచి డేటా సేకరణ షురూ 

Published on Fri, 06/27/2025 - 05:47

సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఈ నెల 12న చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాసిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో’(ఏఏఐబీ) నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని కేంద్ర పౌర విమానయానశాఖ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన బ్లాక్‌బాక్స్‌ను ఢిల్లీకి తరలించినట్లు తెలిపింది. ఈ బృందంలో ఒక ఏవియేషన్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్, ఏటీసీ అధికారి, బోయింగ్‌ విమానాల తయారీ, డిజైన్‌ను రూపొందించిన అమెరికా సంస్థ నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (ఎన్‌టీఎస్‌బీ) ప్రతినిధులు ఉంటారని పేర్కొంది.

 కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్లు (సీవీఆర్‌), ఫ్లైట్‌ డేటా రికార్డర్‌(ఎఫ్‌డీఆర్‌) రెండూ ఏఏఐబీ) ఆధీనంలో ఉన్నాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ‘ఈ నెల 25న ఏఏఐబీ డైరెక్టర్‌ జనరల్‌ యుగంధర్‌ సారథ్యంలోని బృందం ఏఏఐబీ, ఎన్‌టీఎస్‌బీకి చెందిన సాంకేతిక సభ్యులు సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా బ్లాక్‌ బాక్స్‌ నుంచి క్రాష్‌ ప్రొటెక్షన్‌ మాడ్యూల్‌ (సీపీఎం)ను సురక్షితంగా వెలికి తీశారు. మెమరీ మాడ్యూల్‌ను విజయవంతంగా తెరిచాం. డేటాను ఏఏఐబీ ల్యాబ్‌లో డౌన్‌లోడ్‌ చేశాం. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌), విమాన డేటా రికార్డర్‌ (ఎఫ్‌డీఆర్‌) విశ్లేషణ మొదలైంది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునరి్నర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది’అని పౌర విమానయాన శాఖ తెలిపింది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)