Breaking News

గౌతమ్‌ గంభీర్‌ స్థానంలో అక్షయ్‌ కుమార్‌?

Published on Sat, 03/02/2024 - 13:08

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో హుషారు పెరిగిపోతోంది. తూర్పు ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన ఒక ట్వీట్‌లో తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరారు. అదే సమయంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను బీజేపీ  ఇక్కడి నుంచి ఎన్నికల రంగంలోకి దించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గౌతమ్ గంభీర్ తాను ఇకపై తన క్రికెట్ కమిట్‌మెంట్‌లపై దృష్టి పెడతానని అంటున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను బీజేపీ.. ఢిల్లీలోని ఒక స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయమని కోరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయనతో కొందరు పార్టీ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

అక్షయ్ కుమార్ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్‌ కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. అతని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ సీటు నుంచి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. నాటి ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ 6,96,156 ఓట్లతో విజయం సాధించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)