Breaking News

ఎన్నికల బాండ్లు.. వ్యక్తుల విరాళాల్లోనూ బీజేపీనే టాప్‌ !

Published on Fri, 03/22/2024 - 07:34

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) దశల వారిగా వెల్లడిస్తున్న ఎన్నికల బాండ్ల వివరాల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌బీఐ తాజాగా బాండ్ల నంబర్ల వివరాలు ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి అందజేసింది. ఈ వివరాలు అందిన వెంటనే ఈసీ వాటిని గురువారం తన వెబ్‌సైట్‌లో ఉంచింది.  

ఈ వివరాల ద్వారా ఆయా వ్యక్తులు, సంస్థలు ఏ పార్టీకి విరాళమిచ్చారనేది స్పష్టంగా తేలిపోయింది. వీటిలో సంస్థలు కాకుండా వ్యాపార రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు తమ వ్యక్తిగత హోదాలో ఇచ్చిన మొత్తం విరాళాలు రూ. 180.2 కోట్లు. ఏప్రిల్‌ 12,2019 నుంచి జనవరి11,2024 వరకు ఇచ్చిన ఈ విరాళాల్లో సింహభాగం 84.5 శాతం బీజేపీకే వెళ్లడం గమనార్హం.

వ్యక్తిగత విరాళాల్లో రూ.152.2 కోట్లతో బీజేపీ మొదటిస్థానంలో, రూ.16.5 కోట్లతో తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండవ స్థానం, రూ.5 కోట్లతో ఈ జాబితాలో భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)  మూడవ స్థానంలో నిలిచాయి. వ్యక్తిగతంగా బీజేపీకి రూ.35 కోట్ల విరాళమిచ్చి దాతల జాబితాల్లో ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ తొలి స్థానంలో నిలిచారు. రూ.25 కోట్ల విరాళంతో రిలయన్స్‌ టాప్‌ర్యాంకు ఉద్యోగి లక్ష్మీదాస్‌ వల్లభ్‌దాస్‌ మర్చంట్‌ రెండవ స్థానంలో నిలిచారు. కాగా, కార్పొరేట్‌ సంస్ణలు ఎన్నికల బాండ్ల ద్వారా ఇచ్చిన విరాళాల్లోనూ అత్యధికం బీజేపీకే వెళ్లిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. విరాళాల సమస్త వివరాలు బహిర్గతం 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)